జపాన్ వ్యవసాయ మంత్రి రాజీనామా!

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

' జపాన్ వ్యవసాయ శాఖ మంత్రి టెకెహికో ఎండో సోమవారం ఉదయం రాజీనామా చేశారు. అవినీతి అరోపణల్లో చిక్కుకొని గడిచిన నాలుగు నెలల్లో జపాన్ మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు రాజీనామా చేయడం గమనార్వం. వ్యవసాయ రంగ సబ్సిడీలను దుర్వినియోగం చేసిన కుంభకోణంతో సంబంధాలున్నాయని ఎండోపై ఆరోపణలు వచ్చాయి. దీంతో వారం రోజుల క్రితం మంత్రి పదవి చేపట్టిన ఎండో అప్పుడే రాజీనామా చేశారు. ఎండో ఆగస్టు 27న వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం ప్రధాన మంత్రి షింజో అబేకు ఎండో రాజీనామా లేఖను అందజేయగా అబే దానిని ఆమోదించారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.