|
|  |
బంగ్లాదేశ్‌లో మిలటరీ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం వచ్చే ఏడాది చివరినాటికి స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహిస్తామని ఐక్యరాజ్యసమితికి హామీ ఇచ్చింది. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం చీఫ్ డాక్టర్ ఫక్రుద్దీన్ న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సమావేశాల్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల సంఘం ప్రకటించిన విధంగా వచ్చే ఏడాది చివరి నాటికి తమ ప్రభుత్వం బంగ్లాలో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుబడి ఉందని ఆయన అన్నారు. బంగ్లాలో స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించాలంటే దేశ రాజకీయాల్లో ఉన్న అవినీతి, హింసాయుత ధోరణిని రూపుమాపాలని చెప్పారు. తమ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించేందుకు కూడా తాము కట్టుబడి ఉన్నామని ఫక్రుద్దీన్ తెలిపారు.
|
|