|
|
వివాదాస్పద ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై మరో సారి ఆరు దేశాల చర్చలు జరగనున్నాయి. ఈ సారి చర్చలు కూడా చైనా రాజధాని బీజింగ్ వేదిక కానుంది. ఉత్తర కొరియా తమ దేశంలోని అణు కేంద్రాన్ని మూసివేసేందుకు సిద్ధం కావడం ఈసారి చర్చలు విజయవంతం అయ్యే అవకాశాలున్నాయని అమెరికా రాయబారి క్రిస్టోఫర్ హిల్ చెప్పారు.
ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియా తప్పనిసరిగా అణు కేంద్రాలను మూసివేయాలని అంతేకాకుండా అన్నీ అణు కార్యక్రమాల వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఇలా చేయడం ద్వారా ఉత్తర కొరియాకు పెద్ద ఎత్తున ఇంధన సాయం అందించేందుకు అప్పటి ఒప్పందంలో ఆరు దేశాలు అంగీకరించాయి.
అమెరికా, ఉత్తర, దక్షిణ కొరియాలు, జపాన్, రష్యా, చైనాలు శుక్రవారం నుంచి తాజాగా మళ్లీ సమావేశం అవుతున్నాయి. ఈ ఏడాది చివరినాటికి ఉత్తర కొరియా అణు కార్యక్రమాన్ని నిలిపివేసే విధంగా ఈ సమావేశాల్లో ఆరు దేశాలు చర్చలు జరుపుతాయి.
|
|