|
|  |
ఆఫ్ఘానిస్థాన్ దక్షిణ ప్రాంతంలో అమెరికా అధనపు బలగాతో జరిగిన దాడిలో తాలిబన్ తీవ్రవాదులు 59 మంది మృతిచెందారు. ఆ దేశ హిల్మాత్ లోని ముసా కువా ప్రాంతంలో తాలిబన్ తీవ్రవాదులకు , అమెరికా సంయుక్త బలగాలకు మధ్య పోరు జరిగింది.ఇందులో తాలిబన్ తీవ్రవాదుల 59 మంది, సైన్నానికి చెందిన ఒకరు మృతిచెందినట్టు ఆఫ్ఘాన్, అమెరికా సంయుక్త సైన్యాధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.ఈ పోరులో అక్కడి అమాయక ప్రజలు ఎవరైనా మృతి చెందారా అనే వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉన్నట్టు వారు ఆ ప్రకటనలో వివరించారు.
|
|