|
|
జపాన్ ప్రధాన మంత్రి అబే షింజో రాజీనామా చేయడంతో ఆ దేశ పార్లమెంట్ 71 సంవత్సరాల వయసున్న యాసౌ ఫుకూడాని ఆయన వారసుడిగా ఎన్నుకుంది. జపాన్ పార్లమెంట్ దిగువ సభ ఫుకూడాను కొత్త ప్రధానిగా ఎన్నుకోగా, ఎగువ సభ మాత్రం ప్రతిపక్ష నేత ఇఛిరో ఒజావాకు మద్దతిచ్చింది.అనంతరం జరిగిన రెండు సభల కమిటీ సమావేశంలో దిగువ సభ మద్దతిచ్చిన ఫుకూడా జపాన్ కొత్త ప్రధాన మంత్రిగా అధికారికంగా ఎంపిక చేయబడ్డారు. ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్ డీపీ) తరుపున ఫుకూడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
|
|