|
|  |
పాకిస్తాన్ లో దేశాధ్యక్ష ఎన్నికల సమరం అక్టోబర్ 6 న జరుగబోతుంది.దీని కోసం ఈ నెల 27 న పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్ నామినేషన్ ధాఖలు చేయనున్నారు.పాకిస్తాన్ ప్రధానమంత్రి షౌకత్ అజీజ్,అధికార పాకిస్తాన్ ముస్లీం లీగ్ అధ్యక్షుడు షుజాత్ హుస్సేన్ ల మధ్య జరిగిన సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుత జాతీయ,ప్రొవెన్షియల్ అసెంబ్లీల నుంచి ముషరఫ్ తిరిగి ఎన్నికవ్వాలని కోరుకుంటున్నట్లు ఆయన బలోచిస్తాన్ లో సోమవారం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని ' డైలీ టైంస్' పేర్కొంది.పాకిస్తాన్ ముస్లీం లీగ్,దాని మితురపక్షాలు ముషరఫ్ ను తిరిగి ఎన్నుకోవాలన్న హామీకి కట్టుబడి ఉంటాయని హుస్సేన్ అన్నారు.'' ముషరఫ్ ను తిరిగి అధ్యక్షుడి గా నిలబెడితే పాక్ లోశాంతి ,సురక్షిత లకు,అభివృద్దికి హామీ ఉంటుంది" అని ఆయన అన్నారు.
|
|