|
10 వ తేదీన స్వదేశానికి షరీఫ్ !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈనెల పదో తేదీన స్వదేశానికి రానున్నట్టు ప్రకటించారు. స్వదేశీ ఆగమన తేదీని ప్రకటించిన షరీప్ పరోక్షంగా.. ఆ దేశ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు సవాల్ విసినట్టయింది. ఆ దేశ రాజ్యాంగం మేరకు విదేశాల్లో జీవనం గడుపుతున్న షరీఫ్ సోదరులను స్వదేశానికి వచ్చేందుకు పాక్ సుప్రీంకోర్టు ఇటీవల అనుమతించిన విషయం తెల్సిందే. అయితే ఆయనపై ఉన్న కేసులను తిరిగదోడి, అరెస్టు చేసేందుకు పాక్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.ఇదిలా ఉండగాఒక పాక్ జాతీయునిగా స్వదేశానికి వచ్చే మాజీ ప్రధానికి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలుకుతాం. ఆయన రాకను పురస్కరించుకుని ఫ్లవర్ బొకేలతో ఎదురుచూస్తాం. ఆయన పాక్ ప్రజల కోసం ఎంతో సేవ చేశారు. దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం స్థాపనకు ఎంతగానో కృషి చేశారని లాహోర్ పీపీపి మహిళా విభాగం అధ్యక్షురాలు సజిదా మిర్ అన్నారు. | |
|
CLOSEE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.