|
నవంబర్ 15 న ముషారఫ్ ప్రమాణశ్వీకారం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' పాకిస్థాన్ సర్వసైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తిరిగి పౌర అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారాన్ని నవంబరు 15న చేస్తారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) ప్రధాన కార్యదర్శి ముషాయిద్ హుస్సేన్ చెప్పారు.దీనికి సంబంధించిన ఎన్నికలు అక్టోబరులో జరుగుతాయన్నారు. అధ్యక్షుడుగా ముషారఫ్ పదవీ విరమణ కూడా ఆ రోజే అవుతుందన్నారు. మరోవైపు ఆదివారం నాడు ముషారఫ్ ఎన్నికలలో పాల్గొనే విధంగా చట్ట సవరణను పాకిస్థాన్ ఎన్నికల సంఘం చేసింది.తద్వారా ప్రభుత్వ సేవకులు ఎన్నికలలో పాల్గొనరాదన్న నిబంధనకు తిలోదకాలిచ్చారు. పర్వేజ్ ముషారఫ్ 1999లో దేశాధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.