పాకిస్థాన్‌ సంకీర్ణ దళాల ఉపసంహరణ

 

టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

పాకిస్థాన్, ఇరాక్ ప్రాంతాల్లోని యూఎస్ సంకీర్ణ దళాలను ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ ప్రకటించారు. యూఎస్ సంకీర్ణ దళాలతో పాకిస్థాన్ సైనిక దళాలు పటిష్టవంతమవుతున్నాయని,శాంతియుత పరిణామాలు నెలకొనేదిశగా ఇరాక్‌లోని యూఎస్ సంకీర్ణ దళాలను స్వదేశానికి రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామని బుష్ చెప్పారు. ఇరాక్‌లో సైన్యపు విధులను బుష్ ఓవెల్ కార్యాలయంలో అభినందించారు. ప్రస్తుతం అమెరికా 168,000 సంకీర్ణదళాలు ఇరాక్‌లో ఉన్నాయని అన్నారు. ఈ సంకీర్ణ దళాలు ఈ ఏడాది డిసెంబర్ చివరికి స్వదేశానికి చేరుకోనున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఇరాక్, అమెరికాల మధ్య శాంతియుత భద్రతలు చోటుచేసుకోవాలని అన్నారు. దీని కోసం ఇరాక్ మద్దతునివ్వాలని బుష్ పిలుపునిచ్చారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.