|
రష్యా విజయవంతంగా బాంబు ప్రయోగం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
అగ్ర రాజ్యాలలో ఒకటైన రష్యా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబును విజయవంతంగా పరీక్షించింది. అమెరికా తో తమ సంబంధాలు దెబ్బ తింటున్న తరుణంలో రష్యా ఈ పరీక్ష ద్వారా తన సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పినట్లయింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబుగా అమెరికా చెప్పుకుంటున్న దానికంటే ఈ బాంబు నాలుగు రెట్లు అత్యంత శక్తి వంతమైనదని ,గాలిలో ప్రయోగించే ఈ బాంబు పూర్తిగా అణు రహితమైనదని రష్యాలోని ఓ టెలివిజన్ ఛానల్ తన నివేదికలో పేర్కొంది.అణు బాంబుతో పోలిస్తే తాము ప్రయోగం చేసిన అణు రహిత బాంబు చాలా శక్తివంతమైనదని రష్యా భద్రతా దళాల చీఫ్ జనరల్ అలెగ్జాండర్ రుక్సిన్ తెలిపారు. అణు బాంబు ప్రయోగం కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని, అయితే తాము ప్రయోగించిన అణు రహిత బాంబు అలాంటి పరిస్థితి తలెత్తదని ఆయన చెప్పారు. |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.