|
పాకిస్తాన్ లో ఆత్మాహుతి ధాడి 17 మంది మృతి
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
ఇస్లామాబద్: పాకిస్తాన్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణం లో మంగళవారం ఒక ఆత్మాహుతి దళ సభ్యడు తనను తాను పేల్చేసుకొని 17 మంది మరణానికి కారణమయ్యాడు.ఒక మినీ బస్సు లో ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా పోలీసుల కు కనిపించాడు.దాంతో అతని వద్ద పేలుడు పదార్ధాలు వున్నాయన్న అనుమానం తో పోలీసులు సోదా చేయడానికి ప్రయత్నించగా అతను తనను తానే పేల్చేసుకున్నాడని ఆ ప్రాంతం ఎస్పీ ఖలీద్ మహ్మద్ టీవీ చానెళ్ళ కు వివరించారు.ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతం నుంచి నగరానికి వచ్చిన ఒక బస్సు లో ఈ బాంబర్ ఉన్నట్లు గుర్తించారు.ఈ పేలుడు లో ఇద్దరు పోలీసు లు ,ఒక పారామిలటరీ జవాను తో సహా 17 మంది మృతి చెందారు.మరో 20 మంది గాయ పడ్డారు. | |
|
CLOSE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.