|
ముషారఫ్ కు అమెరికా హిత బోద !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం |
![]() |
' పాకిస్థాన్ అధ్యక్షుడు, ఆర్మీ ఛీఫ్‌గా జంట పదవుల్లో కొనసాగుతున్న పర్వేజ్ ముషారఫ్ గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండగలరని అమెరికా విశ్వాసం వ్యక్తం చేసింది.బెనజీర్ భుట్టో, ముషారఫ్‌ల అధికార భాగస్వామ్య ఒప్పందంకింద సైనిక చీఫ్ పదవిని ముషారఫ్ త్యజించనున్నారా అనే ప్రశ్నకు సమాధానంగా ఇలా స్పందించారు.ముషారఫ్ మాట్లాడుతూ జంట పదవులపై రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించగలనని ఆయన తమకు ఇచ్చిన హామీని గౌరవించగలరని విశ్వసిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ఉప ప్రతినిధి టామ్ కేసీ తెలిపారు.పాకిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆసక్తి కనబరుస్తుండటంతో పాటు జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని కాసే అన్నారు. అయితే ముందుగా వారి దగ్గర నుంచి తమకు సమాధానం రావాలని పేర్కొన్నారు. | |
|
CLOSEE HOME
General News Cinema News International News Sports News Political News Business News |
Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.