|
న్యూఢిల్లీ : అణు ఒప్పందానికి భారత్ తీసుకునే చర్యలకు మద్దతిస్తామని అమెరికా తెలిపింది. ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టాలని అన్నారు. వాటికి తమ మద్దతు తప్పకుండా ఉంతుందని అమెరికా పరిపాలన శాఖ ప్రతినిధి సీన్ మెక్ కార్మాక్ చెప్పారు. ఒప్పందం అమల్లోకి వచ్చే నిర్ధిష్ట సమయం కూడా భారత్ నిర్ణయానికే వదిలిపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే భారత్ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో జరిపే అవకాశాలున్నాయి. ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు వివిధ రకాల చర్యలు తీసుకోవాలి. వీటికి తమ మద్దతు ఉంటుందని మెక్ కార్మాక్ చెప్పారు.
|