|
|  |
భారత్, ఫ్రాన్స్ అణు వ్యాపార వేత్తల సమావేశం సోమవారం జరుగనుంది.ఫ్రాన్స్ రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి. భారత అణు ఇంధన సంస్థ తో కలసి తాము ముంబాయిలో ఈ రెండు రోజుల సమావేశానికి ఏర్పాటు చేశామని ఆ వర్గాలు వెల్లడించాయి. ఫ్రాన్స్‌కు చెందిన సుమారు 75 కంపెనీలు, భారత్‌లోని 250 కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని, తమ అభిప్రాయాలను పంచుకుంటారని ఆ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల్లో కలసి పనిచేసే విషయంపై వారు ప్రధానంగా చర్చిస్తారని తెలిపాయి. ఈ తరహాలో ఇరు దేశాల మధ్య వాణిజ్య సదస్సు జరగడం ఇదే మొదటి సారి. భారత్ నుంచి ఈ సమావేశంలో హాజరయ్యే కంపెనీలు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌లకు అనుసంధానంగా ఉన్నవే కావడం విశేషం.
|
|