|
కరేబియన్ సముద్రంలో ద్వీపమైన క్యూబాలో రైలు-బస్సు ఢీకొన్న ప్రమాదంలో 30 మంది ప్రయాణీకులు బలయ్యారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున ఆగ్నేయ క్యూబా ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో 75 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్యూబాలో రెండో అతిపెద్ద నగరమైన సాంటియాగో నుంచి పక్కనే ఉన్న గ్రాన్మా ప్రావిన్స్ లోని మాంజనిల్లోకు రైలు బయలుదేరగా యారా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యారా పట్టణం గమ్యస్థానమైన మాంజనిల్లోకు 20 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రమాదం జరగటానికి గల కారణాలపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. దేశ రాజధాని హవానాకు యారా 800 కి.మీ. దూరంలో ఉంది.
|