|
|
ఇరాక్ లోని బాగ్దాద్ నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖలీస్ ప్రాంతం లో శుక్రవారం అమెరికా దళాలకు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 25 మంది తీవ్రవాదులు మరణించారు. ఇరాన్ తిరుగుబాటు దళాలతో సంబంధాలు కలిగిన కమాండర్ ను లక్ష్యంగా చేసుకొని అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు మధ్య జరిగిన పోరులో రెండు భవనాలు పూర్తిగా ధ్వంసంకాగా, సమారు 25 మంది తీవ్రవాదులు హతమయ్యారని అమెరికా సైనిక వర్గాలు తెలిపాయి. ఇరాన్ నుంచి బాగ్దాద్ కు ఆయుధాలు చేరేందుకు సాయపడుతున్న తీవ్రవాద కమాండర్ కోసం అమెరికా సేనలు ఈ ఆపరేషన్ చేపట్టాయి.
|
|