|
|  |
అవినీతి కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా బెయిల్ పిటిషన్ ను ఆ దేశ సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆమెపై అవినీతి కేసు విచారణను ముందుకు నడిపించాలని ఆదేశించింది. గత నెల ప్రారంభంలో ఖైదు చేసిన ఆమెకు సెప్టెంబర్ 30న హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, సాంకేతిక కారణాలతో ఆమెను విడుదల చేయలేదు. వెంటనే దీనిపై బంగ్లా ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ తీర్పుతో కంటైనర్ టెర్మినల్ కాంట్రాక్టుకు సంబంధించి ఖలీదాజియా జైలులోనే కొనసాగాల్సి ఉంది. అధికారంలో ఉన్న సమయంలో స్థానిక కంపెనీకి ఈ కాంట్రాక్టు కేటాయించడంలో ఆమె అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
|
|