|
|  |
పాకిస్థాన్ లో రాజకీయ మార్పులు అతి వేగంగా మారిపోతున్నాయి. పాక్ నిఘా సంస్థ ఐ.ఎస్ఐ. మాజీ ఉన్నతాధికారి పెరెజ్ కియానీని ఆ దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన వారసునిగా సైనిక జనరల్ పదవికి మంగళవారంనాడు ఖరారు చేశారు. కియానీ చాలా కాలంపాటు ముషారఫ్ కు ఆంతరంగునిగా పనిచేశారు. ఒకవేళ ముషారఫ్ గనక వచ్చే ఎన్నికలలో సాధారణ పౌరునిగా బరిలోకి దిగితే అప్పుడు సైనికాధికారి పాత్ర కియానీ పోషిస్తాడు. అంటే ముషారఫ్ అటు సైనిక దుస్తులు తీసివేసి అధ్యక్షునిగా ఎన్నికైనా, అధికారం మాత్రం తాను ఎంపిక చేసిన వ్యక్తి చేతిలోనే ఉంటుంది.
|
|