|
|  |
అంతర్జాతీయంగా ఇప్పటికే అగ్రభాగానికి చేరుకున్న గ్లోబల్ వార్మింగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి నోబెల్ బహుమతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.గ్లోబల్ వార్మింగ్ పై పోరు సల్పుతున్న అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్ గొరె, ఆర్కిటిక్ ప్రాంతంలో వాతావరణ మార్పులపై విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న కెనడాకు చెందిన వాట్ క్లౌటియర్ లు నోబెల్ రేసులో ముందంజలో ఉన్నారు. ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి 181 మంది అభ్యర్థులు, సంస్థలు నామినేట్ అయ్యాయి. నోబెల్ శాంతి దక్కే అవకాశం అధికంగా ఉన్న వారిలో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్(ఐపీసీసీ), ఆ సంస్థ చైర్మన్ భారత్ కు చెందిన రాజేంద్ర పాచూరి కూడా ఉన్నారు. 2007 సంవత్సరానికి గాను వివిధ విభాగాలలో నోబెల్ శాంతి పురస్కారాన్ని శుక్రవారం ప్రకటించనున్నారు.
|
|