|
|  |
పాకిస్థాన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రధమ పౌరుడు పర్వేజ్ ముషారఫ్ తిరిగి ఎన్నికైనట్టు ఆ దేశ ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికల ఫలితాలను ఇప్పుడే ప్రకటించరాదని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది.దీనితో ముషారఫ్ ఎన్నిక ఎంతవరకూ చట్టబద్దమో అనుమానంలో పడింది. ఈ ఎన్నికల్లో ముషారఫ్ తో పాటుగా వజీహుద్దీన్ అహ్మద్ బరిలోకి దిగగా, ముషారఫ్ కు 252 ఓట్లు, అహ్మద్ కు కేవలం 2 ఓట్లు మాత్రమే వచ్చాయని ఎన్నికల వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జనవరిలో జరుగుతాయి.
|
|