|
|  |
సైనిక, నిఘా వర్గాలు రాజకీయ పాత్ర పోషించకూడదని చెప్పిన పాక్ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ తమ దేశ రాజకీయల్లో ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) హస్తం ఉందని వెల్లడించారు. ఆయన గురువారం మాట్లాడుతూ ఐఎస్ఐ రాజకీయానుబంధం ఈనాటిది కాదని చెప్పారు. గత ఐదు దశాబ్దాల నుంచి పాక్ రాజకీయాల్లో ఐఎస్ఐ ప్రమేయం ఉందని తెలిపారు. మిలటరీ లేదా నిఘా వ్యవస్థులకు రాజకీయాల్లో ప్రమేయం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది జనవరిలో దేశంలో జరగబోతున్న సాధారణ ఎన్నికల స్పేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరగాలంటే ఐఎస్ఐ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండలన్నారు.
|
|