|
|  |
దక్షిణాఫ్రికాలోని ఓ బంగారు గనిలో 3000మంది గని కార్మికులు చిక్కుకున్నారు. కార్లెటాన్విల్లె సమీపంలోని ఈ గనిలో విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో భూగర్భ లిఫ్ట్ పనిచేయకపోవడం తో వారు అందులో చిక్కుకోవాల్సి వచ్చింది. ప్రధాన లిఫ్ట్ దెబ్బతినడంతో స్టీల్ వర్క్, ఎలక్ట్రికల్ ఫీడర్ కార్డ్స్ బాగా దెబ్బతిన్నప్పటికీ, గనిలో చిక్కుకున్న ఏ ఒక్కరికీ గాయాలేర్పడలేదని ఆ హార్మనీ గోల్డ్ ప్రతినిధి అమీలియా సోరెస్ తెలిపారు. త్వరలోనే లిఫ్ట్ పనిచేయడం ప్రారంభించగలదని విశ్వాసం వ్యక్తం చేసిన ఆమె అయితే గనిలో చిక్కుకున్న వారిని బయటకు తీయడం మాత్రం ఆలస్యం కాగలదని తెలిపారు. ప్రతి అర్ధ గంటకు 300 కార్మికులను మాత్రమే బయటకు తీసే అవకాశమున్నందున కొంత సమయం పట్టవచ్చన్నారు.
|
|