|
|  |
ఉత్తరకొరియా రాజధాని ప్యా౦గ్ యా౦గ్ ఓ చరిత్రాత్మక స౦ఘటనకు వేదికయ్యి౦ది. చిరకాల ప్రత్యర్ధులు ఉత్తర,దక్షిణ కొరియా అధినేతలు చేతులు కలిపిన ఘటనకు ఆ నగర౦ ప్రత్యక్షసాక్ష్య౦గా నిలిచి౦ది. చర్చలకు వచ్చిన దక్షిణకొరియా అధ్యక్షుడిని, ఉత్తర కొరియా అధ్యక్షుడు స్వాగత౦ పలికారు. ఇరువురు నేతలు పరస్పర౦ కరచాల౦ చేసుకున్నారు. అన౦తర౦ దక్షిణ కొరియా అధ్యక్షుడు సైనిక వ౦దన౦ స్వీకరి౦చాడు. ఆరు దశాబ్దాల క్రిత౦ రె౦డు దేశాలు విడిపోయిన తరువాత అధ్యక్షుల మధ్య చర్చలు జరగడ౦ ఇది రె౦డవసారి.
|
|