|
|
|
నైజీరియాలో వేతన పెంపు కోసం చేసిన డిమాండ్ తో ఏర్పడిన వివాదం కారణంగా ఆరుగురు భారతీయులు కిడ్నాప్ కు గురయ్యారు. నైజీరియాలోని మధ్య ప్రాంతంలో ఉన్న ఓ స్టీల్ కర్మాగారంలో ఉద్యోగం చేస్తున్న సిబ్బంది గత కొంతకాలంగా 15 శాతం వేతన పెంపును కోరుతూ పోరాటం చేస్తున్నారు. వారి కోరికను అక్టోబర్ రెండో తేదీన తీరుస్తామని యాజమాన్యం చెప్పింది. అయితే వారు డిమాండ్ ను గడువు ముగిసిన తరువాత కూడా పట్టించుకోకుండా యాజమాన్యం కాలయాపన చేస్తూ వచ్చింది. దీంతో అసహనతకు గురైన సిబ్బంది, ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఆరుగురు భారతీయులను కిడ్నాప్ చేసినట్టు అధికారులు తెలిపారు. కిడ్నాప్ కు గురైన వారిని క్షేమంగా విడుదలయ్యేందుకు సిబ్బందితో చర్చలు జరుపుతున్నట్టు యాజమాన్యం ప్రతినిధులు చెప్పారు.
|
|