|
|
|
భారత్-వియత్నాం స్నేహ సంబంధాలను పెంచుకోవడంలో భాగంగా వియత్నాం రాజధాని హనోయ్‌లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహాన్ని ప్రారంభించారు. స్థానిక పార్క్‌కు ఇందిరా పేరు పెట్టినట్టు హనోయ్ పీపుల్స్ కమిటీ వైస్ చైర్మన్ గోతీ తాన్ హాంగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోం శాఖా మంత్రి 'రెండు దేశాల మైత్రి రాబోయే రోజుల్లో అభివృద్ధికి, పరస్పర సహాయసహకారాలకు ఉపయోగపడతాయని' శివరాజ్ పాటిల్ అన్నారు.'హో చి మిన్, నెహ్రూల కాలం నుంచి స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని, ఇందిరా గాంధీ తన 15 ఏళ్ల పదవీ కాలంలో సంబంధాలు మెరుగుపరచుకోవడంలో వీలైనంత కృషిచేశారు' గోతీ తాన్ హాంగ్ అన్నారు.
|
|