|
|
రాష్ట్రంలో గ్రూప్ 1, 2 పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల వయోపరిమితిని 53 ఏళ్ల వరకు పొడిగిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో గ్రూప్ 1, 2 పరీక్షలకు అభ్యర్థులు 53 ఏళ్లు ఉన్న వారు కూడా రాయొచ్చని తెలిపాయి. హైదరాబాద్‌లో గురువారం వెంకట్రామిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జనరల్ కేటగిరికి చెందిన వారు 38 ఏళ్ల వరకు ఈ ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరుకావచ్చునన్నారు. అలాగే రిజర్వేషన్ కేటగిరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారికి ఐదు ఏళ్లు మినహాయింపునివ్వడంతో 43 ఏళ్ల వరకు హాజరు కావచ్చని తెలిపారు. అదే విధంగా వికాలాంగులకు మరో ఐదేళ్ల పాటు మినహాయింపును కలిగించడంతో 48 ఏళ్ల వరకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతున్న వారికి మరో ఐదేళ్లు మినహాయింపును ఇవ్వడంతో 53 ఏళ్ల వరకు హాజరు కావచ్చని ఆయన చెప్పారు.
|
|