ప్రజలకు మరింత అందుబాటులో రైల్వే సేవలు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 భారతీయ రైల్వే కంట్రోల్ ఛార్టింగ్ సిస్టమ్‌(సీసీఎస్)ను అందుబాటులోకి తీసుకురానుంది.జాతీయ రైల్వే విచారణ విభాగంలో త్వరలో ప్రవేశపెట్టనున్న ఐటీ ఆధారిత ఈ కొత్త విధానం వల్ల రైళ్ళు రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగా అందించేలా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందచడమే దీని ముఖ్య ఉద్దేశం . సమాచార వ్యవస్థ మేనేజింగ్ డైరెక్టర్ మాదవ్ పాఠక్ ఈ సిస్టం ప్రవేశపెట్టడంపై వివరించారు. రైళ్ల రాకపోకలకు సంబంధించి ఓ స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు సమాచారం అందించడం ఇప్పటివరకు మానవ ఆధారితంగానే నిర్వహిస్తున్నందున కొద్దిపాటి జాప్యం ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా ప్రయాణికులకు రైళ్ల రాకపోకల సమాచారం అందించడంలో జరిగే జాప్యాన్ని నివారించేందుకి ప్రస్తుతం ప్రవేశపెట్టనున్న సీసీ సిస్టమ్ చక్కగా ఉపయోగపడుతుందని సుమారు రూ. 86 కోట్లతో చేపట్టనున్న ఈ వ్యవస్థను దేశంలోని అన్ని రైళ్లలోనూ ప్రవేశ పెట్టనున్నట్టు ఆయన చెప్పారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.