|
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శనివారం నుంచి తెరలేవనుంది. ఆ రాష్ట్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి మంచి పట్టున్న ఆనంద్ అనే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ముఖ్యంగా గోద్రా అల్లర్లలో నరేంద్ర మోడీతో పాటు.. ఆయన సన్నిహితుల పాత్రను తేటతెల్లం చేసే ఆపరేషన్ కళంక్ (తెహల్కా)ను ప్రధానంశంగా ఎంచుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా.. గత ఐదేళ్ళలో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సిద్ధమేనా అంటూ కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరిన విషయం తెల్సిందే.
|