హిరోషిమా 'విలన్' మృతి
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 జపాన్ దేశంలోని హిరోషిమాపై అణుబాంబు ప్రయోగించిన పైలట్ పాల్ టిబ్బెట్ మృతి చెందారు. ఆయనకు వయస్సు 92 సంవత్సరాలు. గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న టిబ్బెట్ గురువారం తుదిశ్వాస విడిచారు. తాను మృతి చెందితే ఎలాంటి అంత్యక్రియలు నిర్వహించరాదని పాల్ తన సన్నిహితులను ముందుగానే కోరారు. దీంతో ఆయన మృతదేహానికి ఎలాంటి అంత్యక్రియలు లేకుండా శ్మశానవాటికలో పాతిపెట్టారు. ఇదిలా ఉండగా 1945 ఆగస్టు 6 న పైలట్ పాల్ టిబ్బెట్ సహా 13 మంది ఎక్కిన అమెరికా విమానం జపాన్ గగనతలం నుంచి ‘లిటిల్ బోయ్’ అనే పేరు గల అణుబాంబు హీరోషిమా నగరంపై జారవిడిచింది. ఇది సృష్టించిన పెను ఉత్పాతం ప్రపంచానికి తెల్సిందే. దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని లక్షల మంది గాయాలబారిన పడటంతో పాటు.. అనారోగ్యానికి గురయ్యారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.