|
|
|
పవిత్ర ఆజ్మీర్ దర్గాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు పాకిస్తాన్ జాతీయులను భద్రతా సిబ్బంది శనివారం అరెస్టు చేసింది. పాక్‌కు చెందిన ఈ వ్యాపారవేత్తలు గత నెలరోజులుగా భారత్‌లో పర్యటిస్తున్నారని, అయితే.. ఆజ్మీర్ దర్గాలోకి ప్రవేశించేందుకు అధికారుల అనుమతి లేదని వివరించారు. ఆజ్మీర్‌లోని ఖ్వాజా మియానుద్దీన్ ఛిస్తీ దర్గాలోకి ముందస్త అనుమతి లేకుండా ప్రవేశించేందుకు ప్రయత్నించినందుకు వీరిని అరెస్టు చేసినట్టు అడిషినల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు (ఇంటలిజెన్స్) గజానంద్ వర్మా చెప్పారు. వీరు ఢిల్లీ, ముంబై, గోవా, సిమ్లా, రాజస్థాన్‌లోని భివాడి ప్రాంతాలను మాత్రమే సందర్శించేందుకు అనుమతి ఉందని వర్మ చెప్పారు. వీరిపై విదేశీ వీసా అతిక్రమణ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అయితే వీరిని తక్షణం పంపించి వేయాల్సిందిగా కేంద్రం సూచించిందని ఎస్ఎస్‌పి చెప్పారు. గత నెల 11వ తేదీన ఆజ్మీర్ దర్గాలో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి దర్గా భద్రతా నీడలో ఉంది.
|
|