|
|
|
వెబ్‌సైట్లో రాజీవ్ ఉద్యోగశ్రీ పథకం లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని ముఖ్యమంత్రి వైఎస్ అధికారులను ఆదేశించారు. ప్రతిజిల్లాలోనూ ఎక్కడెక్కడ ఉద్యోగావకాశాలను, ఎందరికి కల్పించామన్న వివరాలు పూర్తిగా అందులో ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన రాజీవ్ ఉద్యోగశ్రీ సమీక్షా సదస్సులో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి చూపాల్సిన బాధ్యత తమపై ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తెరగాలన్నారు. 2009నాటికల్లా ఐటీ, బయోటెక్ రంగాల్లో 2.5లక్షలు, ఇతర రంగాల్లో పది లక్షల మందికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ నెలకు కనీసం రూ. 5వేలు జీతం అందేలా చూడాలని కోరారు.
|
|