కాంగ్రెస్ నియంత్రణలో కర్ణాటక రాజభవన్ పనిచేస్తోంది !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

శుక్రవారం చెన్నైలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌ కాంగ్రెస్‌తో మంతనాలు జరపడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ వెంటనే తమను ఆహ్వానించాలని వెంకయ్య డిమాండ్‌ చేశారు.కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ కుటిలయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ గవర్నర్‌ కేంద్రానికి నివేదిక పంపడాన్ని నాయుడు తప్పుపట్టారు. తమకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలంతా గవర్నర్‌ను కలిసి వారం గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఆహ్వానించక పోవడం వెనుక కాంగ్రెస్ కుటిల యత్నాలే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ నియంత్రణలో కర్ణాటక రాజభవన్‌ పనిచేస్తోందని వెంకయ్య ఆరోపించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేసే ఆస్కారం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.