|
|
|
హైదరాబాద్:విపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుపట్టడంతో అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు సభ ఆరంభంలోనే రెండు సార్లు వాయిదాపడింది. వరి మద్దతు ధరపై శాసనసభలో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ ఎంతకీ సద్దుమణగకపోవడంతో స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సభను తొలుత పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా ప్రతిపక్షాలు తమ పట్టు వీడలేదు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. తెలుగుదేశం సభ్యులు ట్రాక్టరులో శాసనసభకు వచ్చారు.వరి దుబ్బలు పట్టుకొని సభకు వచ్చిన దేశం సభ్యులు, సీపీఎం, సీపీఐ, తెరాస ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. వామపక్షాల సభ్యులు వరి కట్టలు పట్టుకుని శాసనసభకు హాజరయ్యారు. శాసనసభ వాయిదాపై సోమవారం తెలుగుదేశం సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శాసనసభ ప్రాంగణంలో బైఠాయింపు జరిపారు. శాసనసభ వెలుపల తెలుగుదేశం పార్టీ ధర్నా నిర్వహించారు.
|
|