వడ్డీ రేట్ల తగ్గింపు ముందే ఊహించాం !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 అమెరికన్ ఫెడరల్ ‌రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం ఊహించిందేనని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. పరపతి విధానాన్ని సమీక్షించే సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఉంటుందని ఆయన ఆయన పేర్కొన్నారు. అమెరికన్ ఫెడరల్ ‌రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడుల వెల్లువ గురించి ఇప్పుడే ఒక అంచనాకు రాలేమన్నారు. సెప్టెంబర్‌లో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను 0.5 శాతం మేర తగ్గించినప్పుడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మన స్టాక్ మార్కెట్‌లోకి మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. సబ్‌ప్రైమ్ లెండింగ్ మార్కెట్ దివాలాతో డీలాపడిన అమెరికన్ మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చిన విషయం తెలిసిందే.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.