|
|
|
పశ్చిమబెంగాల్‌లోని నందిగ్రామ్‌లో జరిగిన ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్ దాడులు, అల్లర్లకు సంబంధించిన అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖా మంత్రి శివరాజ్ పాటిల్‌ను కోరారు. తృణముల్ కాంగ్రెస్ నేతృత్వంలోని భూ ఆక్రమణ వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకుంటున్న పీడీఎస్ పార్టీ నందిగ్రామ్ ఘటనపై ప్రధానికి ఫిర్యాదు చేసింది.ఈ విషయమై పీడీఎస్ అధ్యక్షుడు సైపుద్ధిన్ చౌదరికి ప్రధాని సమాధానం పంపారు. కెజూరీలో జరిగిన ఈ అల్లర్లపై పూర్తి దర్యాప్తుకు ఆదేశించానని తెలిపారు. కానీ నందిగ్రామ్‌కు సీఆర్‌పీఎఫ్ దళాలను పంపే విషయంలో మాత్రం ప్రధాని ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా నందిగ్రామ్‌లో సీఆర్‌పీఎఫ్ దళాలను రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉంచరాదని తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ విషయమై రాష్ట్ర హోం సెక్రటరి పీఆర్ రాయ్ మాట్లాడుతూ సీఆర్‌పీఎఫ్ దళాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నా స్వతంత్రంగా వ్యవహరిస్తాయని చెప్పారు.
|
|