|
|
|
హైదరాబాద్: ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోమవారం ట్రాక్టరుపై శాసనసభకు వచ్చారు. పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ ట్రాక్టరును నడిపారు. వరికి మద్దతు ధర ప్రకటించనందుకు నిరసనగా ఆయన ట్రాక్టరుపై వచ్చారు. నిజానికి ఆయన ఎడ్ల బండిపై రావాలనుకున్నారు. అయితే పోలీసులు అందుకు అనుమతించలేదు. దాంతో ట్రాక్టరుపై వచ్చారు. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి ఇచ్చని అల్పాహార విందుకు చంద్రబాబు హాజరు కాలేదు. ఎడ్లబండిపై శాసనసభకు తెలుగుదేశం నాయకుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బయలుదేరిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. తమ్మినేని సీతారాంతో పాటు తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషనుకు తరలించారు. ఎడ్లబండిని కూడా పోలీసు స్టేషను వద్ద ఉంచారు.
|
|