|
కర్నాటకలో బిజెపి-జనతాదళ్ పార్టీలు కలిసి తమ 129 మంది మెజార్టీ ఎమ్మెల్యేలతో మంగళవారం రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. బిజెపి పార్టీకి జనతాదళ్ మద్దుతు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడంతో ఇరుపార్టీలు ఆందోళన నిర్వహిస్తున్న విషయం విదితమే. మైసూరులో జరిగిన విలేఖర్ల సమావేశంలో బిజెపి నిర్వహిస్తున్న పెరేడ్‌కు జనతాదళ్ నేత కుమారస్వామి తమ మద్దతు ప్రకటించారు. పెరేడ్ నిమిత్త ఇరు పార్టీల ఎమ్మెల్యేలను సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలించనున్నట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి. బిజెపి కేంద్ర నాయకత్వం ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ తో అపాయింట్మెంట్ ఖరారు చేసుకున్నారు.
|