|
|
ఢిల్లీ జంక్షన్ పేల్చివేస్తామని జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థ బెదిరింపు లేఖ పంపింది. ఢిల్లీ జంక్షన్‌తో పాటు ఉత్తర భారతంలోని రైల్వే స్టేషన్లు, వైష్ణోదేవి దేవాలయం సహా ముఖ్యమైన ప్రార్థనా మందిరాలు పేల్చి వేస్తామని ఆ లేఖలో జైషే హెచ్చరించింది. మీరట్ పోస్ట్ ఆఫీస్ స్టాంపుతో కూడిన ఈ లేఖ ఢిల్లీ రైల్వే జంక్షన్ కార్యాలయానికి జైషే సంస్థ నేత తస్లీన్ మౌల్వి పేరుతో శుక్రవారం సాయంత్రం వచ్చింది. అ ప్రకారం ఉత్తరాదిన వివిధ రైల్వే స్టేషన్లలో పేలుళ్లు జరిపిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా న్యూఢిల్లీ, ఢిల్లీ జంక్షన్, అమృత్‌సర్, లూధియానా రైల్వే స్టేషన్లు, జమ్ముకాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఉన్న వైష్ణోదేవి దేవాయలం కూడా తమ పేలుడు లక్ష్యాలలో ఉన్నాయని పేర్కొన్నారు.
|
|