|
|
|
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఆర్థిక మంత్రి పి. చిదంబరం పిలుపునిచ్చారు. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా అపోహలు పోవడమే గాక, అభివృద్ధిని చూరగొనవచ్చని ఆయన తెలిపారు. పుదుకొట్టై జిల్లా అరిమలమ్ ప్రాంతంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో కార్యకర్తల నుద్దేశించి చిదంబరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు, సంస్కరణలు పూర్తి స్థాయిలో అమలవ్వాలంటే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమేనని చెప్పారు. తమిళనాడులో కురుస్తున్న కాస్తంత వర్షాలకే రవాణా మార్గాలు అద్వాన్నంగా తయారవుతున్నాయని ఆయన ఆరోపించారు. రోడ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగినంత జాగ్రత్తలు పాటించి, నాణ్యతను కలిగిన రోడ్ల నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
|
|