|
|
|
విశాఖ లో సినీతారలు, క్రికెటర్లతో సందడి మొదలైంది. వెల్పేర్ టాలీవుడ్ క్రికెట్ ట్రోఫీలో ఆడేందుకు పోర్ట్ డైమండ్ జూబ్లీ స్టేడియానికి తారలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ప్రముఖ సినీనటులు శ్రీకాంత్, తరుణ్, సాయికుమార్, అయప్పశర్మ, రాజీవ్ కనకాల, రఘలతో పాటు మరికొందరు సినీనటులు ఈ మ్యాచ్ లో ఆడనున్నారు. అర్జున అవార్డు గ్రహిత బాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్, మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అబ్బాసుద్దీన్, అంబటీ రాయుడు తదితరులు పాల్గొంటున్నారు. ఎ.పి.స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఈ మ్యాచ్ ను నిర్వహిస్తున్నారు,ఈ మ్యాచ్ ద్వారా విరాళాలు సేకరిస్తారు.సినీతారలు, క్రీడాకారుల క్రికెట్ మ్యాచ్ తో స్టేడియం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
|
|