|
|
|
తిరుమల వేంకటేశ్వరుడికి మనీ ఆర్డర్ ద్వారా కానుకలు పంపించే భక్తులకు ఓ కొత్త సదుపాయం. భక్తుల కానుకలు భగవంతుడికి చేరాయన్న వర్తమానంతో పాటు శ్రీవారి ఆశీస్సులూ తిరుగు టపాలో భక్తులకు చేరవేసే సౌకర్యం. దీనికి ఆశీర్వచనమని పేరు. దీనికి 'గ్రామీణ స్పీడ్ పోస్టు'గా పేరు పెట్టారు. ఇంకా ఇలాంటివే ఎన్నో వినూత్న మార్గాల్లో పయనిస్తోంది తపాలా శాఖ. ఆ శాఖ ఆంధ్రా సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ యశోధరా మీనన్ శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు. ఇంతకాలం శ్రీవారికి మనీ ఆర్డర్ పంపిన భక్తులకు చేరిందో లేదోనన్న సందేహం ఉండేదని, ఆ సందేహం నివృత్తి చేయడంతోపాటు, శ్రీవారి ఆశీర్వచనాలను తిరిగి అందించే ఏర్పాటు చేస్తున్నామని యశోధర చెప్పారు.
|
|