|
|
ఆరు పెళ్లిళ్లు చేసుకున్న విజయకృష్ణను పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేశారు. అతను ఇప్పటి వరకు ఆరు పెళ్లిళ్లు జరిగాయి. ఆరో పెళ్లి చేసుకుని విశాఖపట్నం చేరుకున్న విజయకృష్ణను పోలీసులు అనుసరించి అరెస్టు చేశారు.అయితే తాను ఏ తప్పూ చేయలేదని విజయకృష్ణ అంటున్నాడు. తనను ప్రేమించిన అమ్మాయి తండ్రి తనపై కిడ్నాప్ కేసు పెట్టడంతో పోలీసులు తనను అరెస్టు చేశారని, అంతకు మించి ఏమీ లేదని అతను అంటున్నాడు.కానీ, అతనిపై ఒక అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతో విజయకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేసి చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడం విజయకృష్ణ చేసేవాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది.
|
|