|
|
|
మాజీ ముఖ్యమంత్రి హోదాలో లాలూ ప్రసాద్ యాదవ్ కు కల్పిస్తున్న రక్షణను బీహార్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నిన్న జారీ చేసినట్లు అధికారులు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రికి, అతని కుటుంబసభ్యులకు అధికారం నుంచి వైదొలగిన ఐదేళ్ల వరకూ రక్షణ కల్పించాలంటూ ఆర్జేడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓ చట్టాన్ని రూపొందించింది. ఈ సెప్టెంబర్ లో ఆ చట్టం కాలపరిమితి ముగిసిందనీ, కాలపరిమితిని పొడగించే ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని బీహార్ కు చెందిన సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. జెడ్ ప్లస్ కేటగిరీలో మాత్రం లాలూకు భద్రత కొనసాగుతుంది. ఓ బుల్లెట్ ప్రూఫ్ కారు, ఆరు వాహనాలు, 35 మంది పోలీసులను ప్రస్తుతం లాలూ రక్షణ కోసం వినియోగిస్తున్నారు.
|
|