|
|
|
తెలంగాణా ప్రజలకు అవసరమైన తాగు, సాగునీరును అందించే నిజాంసాగర్ ఆధునికీరణ పనులకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా తెలంగాణాలో పూర్తైన తొలి పథకం ఆలీసాగర్‌ను వైఎస్ ఆదివారం ప్రారంభించారు. నిజాంసాగర్ పనులు మార్చినాటికి ప్రారంభమౌతాయని తెలిపారు. ఆలీసాగర్ పూర్తికావడం ద్వారా నిజామాబాద్ జిల్లాలోని బోధన్, నిజామాబాద్, డిచ్‌పల్లి నియోజకవర్గాల్లోని ఆరు మండలాలకు నీటి కొరత తీరుతుందన్నారు. తెలంగాణా అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణాలోని 53 లక్షల ఎకరాలకు అవసరమైన సాగునీరు అందించటానికి రూ.51 వేల కోట్లు వ్యయం చేస్తున్నామని వైఎస్ వెల్లడించారు.
|
|