|
|
|
వరికి మద్దతు ధర అమలులో స్వామినాధన్ కమిటీ సిఫార్సులు తక్షణం అమలు చేయాలని చంద్రబాబు మంగళవారం శాసనసభలో వెల్లడించారు. రాజకీయాలకతీతంగా రైతుల సంక్షేమం కోసం పోరాడవలసిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు పిఎల్ 480 క్రింద వరిని దిగుమతి చేసుకునే స్థాయి నుండి, గ్రీన్ రెవల్యూషన్ కారణంగా వరిని ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నా రైతుల ఆర్దికస్థితి మెరుగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్దిక సంస్కరణల ఫలితంగా దేశం 9 శాతం అభివృద్ది సాధించినా రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపద సృష్టిస్తున్నా, రైతులు కడగండ్ల పాలు కావడానకి కారణాలేమిటో అందరూ ఆలోచించాలన్నారు. వరికి కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడాన్ని బాబు తప్పుపట్టారు. అకాల వర్షాలు, కూలీ రేట్లు పెరుగుదల, అధిక వడ్డీలతో పంటలలో నాణ్యత కరువవుతోందని బాబు తెలిపారు. రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయి కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్న వైనాన్ని బాబు వివరించారు.
|
|