|
దేశంలో పేట్రేగిపోతున్న తీవ్రవాదం అంతానికే అత్యవసర పరిస్థితి విధించాల్సి వచ్చిందని పాకిస్థాన్ ప్రథమ పౌరుడు పర్వేజ్ ముషారఫ్ ప్రకటించారు.అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత మొట్టమొదటిసారి జాతినుద్దేశ్యించి ముషారఫ్ ఆదివారం అర్ధరాత్రి ప్రసంగించారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కష్టమైనా ఈ పని చేయాల్సివచ్చిందని వివరణ ఇచ్చారు. న్యాయవ్యవస్థ అదుపుతప్పి వ్యవహరిస్తూ పరిపాలనా యంత్రాంగంపై పట్టు సాధించాలని ఆశించిన మీదటే ఈ చర్య చేపట్టానని తెలిపారు. దేశంలో నెలకొన్న పరిస్థితులే తనను ఈ పరిస్థితి విధించేలా చేసిందని చెప్పారు. వ్యకిగత కారణాల నేపథ్యంలో ఈ పని చేయలేదని స్పష్టం చేశారు. ముషారఫ్ తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలతో పాటుగా మీడియా కూడా మండిపడుతుంది.
|