కూతురును గృహనిర్భందంలో పెట్టిన తల్లి
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

             అనంతపురం జిల్లా లో గత ఆరునెలలుగా సుజాత అనే ఓ యువతి ని ఆమె తల్లే గృహ నిర్బంధంలో పెట్టిన విషయం వెలుగు చూసింది. స్థానిక నీరుగంటి వీధిలో సుజాత అనే యువతి ఒక ఇంట్లో 'ఆకలి' అంటూ రోధిస్తుండగా స్థానికులు గమనించి ఇంట్లోకి చూశారు.పీచుకట్టిన జుట్టుతో,దాదాపు రెండంగుళాల మేర పెరిగిన గోళ్లతో,చిరిగిన గుడ్డలతో ఇంట్లోని చిత్తుకాగితాలు తింటూ ఆ యువతి వారికి కనపడింది.అది చూసి ఆశ్చర్యపోయిన స్థానికులు పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేశారు.దాంతో పోలీసులు ఆ ఇంటి తలుపు పగుల గొట్టి యువతిని ఆసుపత్రికి తరలించారు. సుజాత తల్లి సరోజమ్మ గృహనిర్బంధానికి పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.పెళ్లీడు వచ్చినప్పటికి తనకు పెళ్లిచేసేవారు లేరని కొంతకాలంగా మధనపడిన సుజాతకు మానసికస్థితి దెబ్బతింది. సరోజమ్మ అనంతపురం నగరపాలక సంస్థలో స్వీపర్ గా పనిచేస్తోంది.సుజాతకు వైద్యం చేయించినా,పెళ్లిచేసినా,డబ్బు దండగ తప్ప ఏమీ లాభం ఉండదని అని భావించిన సరోజమ్మ సుజాతను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లడం.. తోచిన సమయంలో ఇంత తిండి పెట్టటం చేస్తోందని స్థానికులు చెబుతున్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.