|
|
|
వరికి మద్దతు ధర కల్పించే విషయంలో అఖిలపక్షంతో వెళ్ళి ప్రధానిని కలుద్దామని చెప్పినా వినకుండా, ముఖ్యమంత్రి ఒంటరిగా వెళ్లి భంగపడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు.రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కేంద్రం వద్ద ప్రయోజనాలు సాధించుకోలేకపోతున్నామని ఆయన అన్నారు. తిరుపతిలో డిసెంబర్ నుంచి జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభ సమావేశాల్లో భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేస్తామని చెప్పారు. రాజకీయ పక్షాలు కలిసివచ్చినా, రాకపోయినా ప్రజాసంఘాలతోనే మూడో కూటమి ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. తాము చిరంజీవినో బీజేపీనో నమ్ముకొని ఈ ప్రయత్నాలు మొదలుపెట్టలేదన్నారు.
|
|