|
|
వరికి మద్దతు ధర పెంచాలంటూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో టీడీపీ నేతలు వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లా అధికారుల సమావేశాన్ని పురస్కరించుకొని జరిపిన ఈ ప్రదర్శనలో కొందరు రైతులు ప్రధాని మంత్రి మహ్మోహన్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా, ముఖ్యమంత్రి వైఎస్ వేషాలు ధరించారు.వీరు ఎక్కిన ఎడ్ల బండ్లను తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, పీతల సుజాత సమావేశమందిరాం వరకూ లాగారు. వీరితో పాటు టీడెపీ జడ్పీటీసీ సభ్యులు కూడా మరికొన్న ఎడ్లబండ్లను లాగారు. వరికి వెయ్యిరూపాయల మద్దతుధర కల్పించేవరకూ తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా నేతలు చెప్పారు. వీరు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది.
|
|