అ అంటే అసురులు, ఆ అంటే ఆటోవాలా !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

       పై విధంగా భవిష్యత్తులో పిల్లలు చదువుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే వారు రోజు స్కూలుకు వెళ్లే ఆటోనే వారికి మొదటి స్కూలుగా తయారయి ఆటో వాలాల పెడ బుద్ధులు అలవాటు అయ్యే లక్షణాలున్నాయి మరి. ఆటోని 99 శాతం వాడేది మధ్య తరగతి, దిగువ తరగతి ప్రయాణీకులే. ఇప్పుడు జరుగుతున్న సమరమంతా వారిని ఎన్ని రకాలుగా దోచుకోవాలా అన్నదే. ఆ మధ్య ఆరుగురు పిల్లలు వెళ్తున్న ఒక ఆటోను చూసి అవాక్కయ్యాను. వారందరూ చిన్న పిల్లలే అయినా, పెద్ద పెద్ద మూటలలాంటి బ్యాగులు వున్నాయి. అమ్మాయిలూ వున్నారు. అప్పటికే ఆటోలో ఎలానో సర్దుకు కూర్చుని అమాయకంగా చూస్తున్నారు పాపం. వారిని అలా పంపిస్తున్న తల్లితండ్రుల మీద చిర్రెత్తుకొచ్చినా, స్కూల్లు, వాటి దూరాలు, ఆర్దిక కారణాలు గుర్తొచ్చి "పాపం పేరెంట్స్" అనుకున్నాను. ఇప్పుడు ఆ సంఖ్యను "ఎనిమిది" కి పెంచాలంట. పిల్లకాయలు అని సరదాగా అనుకుంటాం..వారేమీ నిజంగానే "కాయలు" కాదు. బస్తాల్లో కుక్కినట్లు ఆటోలో కుక్కడానికి. ఈ ముదనష్టపు ఐడియాకి సీ.పి.యమ్, సీపిఐ లాంటి అవకాశవాద బూర్జువా పార్టీల మద్దతు. కాంగ్రెస్‍వి వోటు బ్యాంకు రాజకీయాలంటూనే తెలుగు దేశం కూడా ఈ చెత్త బ్లాక్ మెయిలింగ్ అంశాలకు మద్దతు ప్రకటించింది. "ఠాగుర్" చిత్రంలో ప్రకాశ్ రాజ్ తన పాట్లు చూసి గేలిగా నవ్విన తోటి కానిష్టేబుల్ ని ఉద్దేశించి ఇలా అంటాడు "నవ్వురా నవ్వు…నువ్వు ఈ రోజు నన్ను చూసి నవ్వుతున్నావు…రేపు నిన్ను చూసి నేను నవ్వుతాను…ఇలా మనం ఉండబట్టే మన జీవితాలను చూసి అందరూ నవ్వుతారు" అని. సరిగ్గా ఈ డైలాగ్ గుర్తులేదు కానీ, అది సరిగ్గా మన రాజకీయ పార్టీలకు సరిపోతుంది. ఒక సరళీకరణ మార్పును ప్రభుత్వం తెస్తుంది అంటే, వారిని అభినందించి సహకరించటం మానేసి దోపిడీ మూకలకు మద్దతిచ్చేస్తున్నాయి ఇప్పటి పార్టీలు. కొన్నాల్లకు కనీసం పారిపోయే ఛాన్స్ ఇవ్వకుండా పట్టేసుకుంటున్నారని గజ దొంగలందరూ ఒక ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లను వినిపించినా "హాశ్చెర్యం" లేదు. దానికి అన్ని పార్టీలు "బే సిగ్గు" గా మద్దతు ప్రకటించేస్తాయి. మద్దతేగా….ఫ్రీ నే గదా..ప్రకటిస్తే పోలా…

ఇక ఆటో చెత్త విషయం.(1)నగరంలో ఎనభై శాతం చెత్త మీటర్లే వాడుబడుతున్నాయి (ఇది ఒక శాతం అని ఆటోవాల్ల కారు కూత)  (2)చాలా వరకు ప్రమాదాలకు కారణం ఆటోలు (ఈ ప్రమాదాలలో అవి ఏమి అవ్వవు…) (3)అతి ప్రమాదకర డ్రయివింగుకు చిరునామా ఆటోవారే (4)తొంభై శాతం ఆటోలు సిగ్నల్స్ ను పాటించే సీనే లేదు (5)చాలా వరకూ ఆటోలు అద్దెకు తీసుకుని తిప్పేవే…(వాటి సొంతదారులందరూ బడా బాబులు…)(6)మహిళలకు రాత్రుల్లు ఇప్పటికీ ఆటో ప్రయాణం సురక్షితం కాదు (ఇక ఆటోల స్థానే కార్లు వస్తే? వామ్మో…)(7)నగరంలో ట్రాఫిక్ నరకానికి ప్రధాన కారణాలలో ఒక కారణం ఈ ఆటోలే.(8)ఆని రకాల ఆక్రమణలు వీరు సొంతం ..బస్ స్టాండులు, రోడ్డులో కొంత భాగం, ప్రధాన రోడ్ల మలుపులు ఒకటేమిటి.…"అసలు ఈ లక్ష ఆటోలను తీసేసి చిన్న చిన్న బస్సులు తిపితే నయమండి…సుఖంగా వుంటుందని". నిజమే అనిపించింది. ఆటోలు ప్రయాణ సాధనాలు. అంతే. అక్కడితో ఆగాలి. అంతే గాని అదేదో కల్లు గీత పరిశ్రమలాగా హడావిడి చేసి యూనియన్లుగా తయారైతే ఇలానే వుంటుంది.

రేప్పొద్దున్న సిటీ బస్సుల సంఖ్యను తగ్గించమని డిమాండు చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.

భవిష్యత్తులో ఈ నగర జనాభాను ఆ దేవుడే రక్షించాలి…చివరకు "ఆటోల యూనియన్ నుంచి", "తోపుడు బల్ల సంఘం నుంచి", "జూబ్లీ హిల్స్ కాల్పు గాళ్ళ సమితి నుంచి", "కొజ్జా నేరగాళ్ళ యువత నుంచి",

రాజకీయమా ! నువ్వు మాత్రం నీ కుళ్లు నవ్వు ఆపకు. నీకది అచ్చి వచ్చిన నవ్వు. కనీసం తరువాతి ఎన్నికల వరకూ..

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.